Sun Dec 14 2025 11:33:18 GMT+0000 (Coordinated Universal Time)
రెడ్ అలెర్ట్.. భారీ వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 61 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కువ ప్రాంతాల్లో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై అలుముకున్న దట్టమైన మేఘాల కారణంగానూ, అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు భారీగా పడతాయని హెచ్చరించింది.
నిండుకుండల్లా....
ఇప్పటికే తెలంగాణాల్లో అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే భారీ వానలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఒక్కరోజులోనే కాళేశ్వరం ప్రాంతంలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. వంతెనల వద్ద ప్రత్యేకంగా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారులను సూచించారు. విద్యాసంస్థలకు కూడా మూడు రోజులు సెలవు ప్రకటించారు.
Next Story

