Thu Mar 19 2026 02:59:17 GMT+0530 (India Standard Time)
వరసగా ఆస్పత్రిపాలవుతున్న మల్లారెడ్డి కుటుంబ సభ్యులు
మంత్రి మల్లారెడ్డి కుటుంబంలో సభ్యులు వరసగా అస్వస్థతకు గురవుతున్నారు.

మల్లారెడ్డి కుటుంబంలో సభ్యులు వరసగా అస్వస్థతకు గురవుతున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురికాగా, తాజాగా ఆయన మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి కూడా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రవీణ్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరదలి కుమారుడు....
నిన్న తెల్లవారు జామునుంచి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మహేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిల ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, వత్తిడి కారణంగానే కొంత ఛాతీ నొప్పి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మాత్రం రెండో రోజు కూడా మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
- Tags
- mallareddy
- sick
Next Story

