Sun Mar 15 2026 21:33:19 GMT+0530 (India Standard Time)
నేడు ప్రధానితో కోమటిరెడ్డి భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో నేడు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో నేడు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు. పార్లమెంటు హాలులో ఆయన సమావేశం కానున్నారు. తన నియోజకవర్గం పరిధిలో జరిగే అభివృద్ధి పనులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానితో చర్చించనున్నారు.
అభివృద్ధి పనులను...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ లో సంతోషకరంగా లేరు. ఆయన కూడా పార్టీ వీడే అవకాశాలున్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ప్రధానితో భేటీ కేవలం అభివృద్ధి కోసమేనంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.
Next Story

