Tue Dec 16 2025 00:07:36 GMT+0000 (Coordinated Universal Time)
నా వ్యాఖ్యలను వక్రీకరించారు : కోమటిరెడ్డి
తన వ్యాఖ్యలను వక్రీకరించారని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు

తన వ్యాఖ్యలను వక్రీకరించారని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను పార్టీని డ్యామేజీ చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. హంగ్ వస్తుందని తాను అనలేదని చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని కూడా తాను చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యలు ఎవరికి అర్థమవుతాయో వారికి అర్థమవుతాయని ఆయన అన్నారు.
ఎవరితోనూ పొత్తు ఉండదు...
కాంగ్రెస్కు ఎవరితోనూ పొత్తు ఉండదని చెప్పానని అన్నారు. ఒంటరిగానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళుతుందని చెప్పిన తాను అన్న వ్యాఖ్యలను కొందరు పక్కదారి పట్టించేలా చేశారని అన్నారు. చిన్న చిన్న నాయకులు కూడా తనను తిట్టారన్నారు. అయినా తాను సహనంతో ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తన వ్యాఖ్యలపై రాజకీయం చేస్తున్నారని, ఇది తగదని వారికి సూచించారు.
Next Story

