Thu Mar 26 2026 13:33:46 GMT+0530 (India Standard Time)
షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చా
తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను షోకాజ్ నోటీసుకు రెండు రోజల క్రితమే వివరణ పంపానని ఆయన తెలిపారు. వివరణ స్వయంగా ఇచ్చుకోవాలనుకుంటే తారిక్ అన్వర్ అందుబాటులో లేరని ఆయన అన్నారు.
ఎలా యాత్రలో పాల్గొంటా?
తాను నియోజకవర్గం పనుల మీద తిరుగుతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనకపోవడానికి షోకాజ్ నోటీసు కారణమని ఆయన అన్నారు. షోకాజ్ నోటీసు ఇస్తే యాత్రలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. తనకు క్లీన్ చిట్ ఇస్తే యాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు.
Next Story

