Wed Mar 18 2026 21:37:36 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి
ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు

ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కోమటిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. తన సోదరుడికి ఓటు వేయాలని ఆయన ఆడియో, వీడియోలు లీకులు కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది.
షోకాజ్ నోటీసుకు...
పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. రేపటి తో షోకాజ్ నోటీసు గడువు పూర్తవుతుంది. అయితే ఆయన షోకాజ్ నోటీసుకు వివరణ ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఈరోజు హైదరాబాద్ చేరుకోవడంతో ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Next Story

