Thu Jan 29 2026 15:08:53 GMT+0000 (Coordinated Universal Time)
థాక్రేతో కోమటిరెడ్డి భేటీ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రేతో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రేతో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాణిక్ రావు థాక్రే ఫోన్ చేశారు. తాను గాంధీభవన్ కు రానని, బయట వచ్చి కలుస్తానని కోమటిరెడ్డి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే కోమటిరెడ్డి హోటల్ లో మాణిక్ రావు థాక్రేతో భేటీ అయ్యారు.
పాదయాత్రలో...
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మాణిక్ రావు దృష్టికి తీసుకెళ్లనున్నారు. రెండో రోజు కూడా థాక్రే నాయకులతో సమీక్షలు చేయనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 26 నుంచి పీసీసీ చీఫ్ తో పాటు అందరు నేతలు పాదయాత్రలో పాల్గొనాలని ఆయన ఇప్పటికే నేతలను ఆదేశించినట్లు తెలిసింది. క్రమశిక్షణతో మెలగాలని, లైన్ దాట వద్దని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
Next Story

