Tue Dec 16 2025 00:04:16 GMT+0000 (Coordinated Universal Time)
13 నుంచి కోమటిరెడ్డి యాత్ర
ఈ నెల 13 నుంచి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల వద్దకు వెళుతున్నారు.

ఈ నెల 13 నుంచి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల వద్దకు వెళుతున్నారు. పాదయాత్రకు సమయం లేకపోవడంతో బైక్ యాత్ర కాని, బస్సు యాత్ర కాని ఆయన చేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆయన యాత్ర చేపట్టనున్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు థాక్రే వచ్చిన తర్వాత కొంత యాక్టివ్ అయ్యారు.
నాలుగు జిల్లాల్లో....
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేయాలని పీసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం బైక్ యాత్ర గాని, బస్సు యాత్ర గాని చేయాలని నిర్ణయించారు. ఒకవైపు రేవంత్ పాదయాత్ర కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా తన యాత్రను ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను ఎవరినీ విమర్శించనని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తానో మాత్రమే ప్రజలకు వివరిస్తానని ఆయన అన్నారు.
Next Story

