Fri Dec 05 2025 13:14:53 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి మరో షరతు.. అదేంటంటే?
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో షరతు విధించారు

పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో షరతు విధించారు. అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే తాను మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. అద్దంకి దయాకర్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన కోరారు. అప్పుడే తాను ప్రచారంలో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
సస్పెండ్ చేస్తేనే....
చుండూరు సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పరుష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ క్రమశక్షణ చర్యలకు ఆదేశించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. రేవంత్ క్షమాపణ చెప్పేశారు. అద్దంకి దయాకర్ కూడా తాను చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. అయినా మరోసారి ఆయన షరతు విధించారు. అద్దంకిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story

