Sat Mar 07 2026 22:30:22 GMT+0530 (India Standard Time)
ఆ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా
ఏఐసీసీ నిర్వహించిన సమావేశానికి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు

ఏఐసీసీ నిర్వహించిన సమావేశానికి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు. ఉదయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీలో కోమటిరెడ్డి వెంకరెడ్డి సమావేశమయ్యారు. అయితే సాయంత్రం జరిగిన పార్టీ సమావేశానికి మాత్రం ఆయన హాజరు కాలేదు. ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన సమావేవానికి దూరంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లినట్లు చెబుతున్నారు.
మునుగోడుపై...
కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు సాయంత్రం ఎనిమిది మంది కీలక నేతలతో సమావేశం నిర్వహించింది. ప్రధానంగా మునుగోడు అంశంపై చర్చించాలని సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించింది. ప్రియాంక గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటారని కూడా చెప్పారు. అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈ సమాశవేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనను మునుగోడు భాగస్వామిని చేరుస్తారని భావించి ఆయన సమావేశానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
Next Story

