Sun Mar 08 2026 01:29:40 GMT+0530 (India Standard Time)
ముచ్చింతల్ కు మెగాస్టార్
216 అడుగుల సువర్ణ సమతా మూర్తిని దర్శించుకునేందుకు, అక్కడి యాగశాలలో నిర్వహిస్తోన్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సినీ

ముచ్చింతల్ శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11వ రోజు శనివారం అక్కడి కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతున్నాయి. 216 అడుగుల సువర్ణ సమతా మూర్తిని దర్శించుకునేందుకు, అక్కడి యాగశాలలో నిర్వహిస్తోన్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు.. ఇతర రంగాలకు చెందిన వారు తరలివస్తున్నారు. అలాగే దేశ నలుమూలల నుంచి భక్తులు కూడా ముచ్చింతల్ కు క్యూ కట్టారు.
నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ముచ్చింతల్ కు విచ్చేయనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా నేడు ముచ్చింతల్ కు వచ్చి, సువర్ణ సమతా మూర్తిని దర్శించుకోనున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారమే సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామిజీ అల్లు అర్జున్‌కు మంగళ శాసనాలు అందించారు.
Next Story

