Sat Dec 06 2025 16:08:07 GMT+0000 (Coordinated Universal Time)
సరిహద్దు రాష్ట్రాల్లో ఒమిక్రాన్.. తెలంగాణ అప్రమత్తం
సరిహద్దు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రవేశించడంతో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కీలక సమావేశం జరగనుంది.

ఒమిక్రాన్ వేరియంట్ తో తెలంగాణ అప్రమత్తమయింది. సరిహద్దు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రవేశించడంతో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నేడు కీలక సమావేశం జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేడు రాష్ట్ర వైద్యాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒమిక్రాన్ విషయంలో విధించాల్సిన నిబంధనలను గురించి చర్చిస్తారని తెలిసింది.
థర్డ్ వేవ్ ను....
తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. సరిహద్దుల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించాలా? లేదా? అన్న దానిపై నేడు సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడం, ఆక్సిజన్ నిల్వలు, మందుల కొరత లేకుండా చూసుకోవడం వంటి వాటిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది.
Next Story

