Sun Feb 01 2026 18:20:39 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ ఢిల్లీ పర్యటన వాయిదా
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. రేపు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. రేపు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం నేడు వాయిదా పడింది. తెలంగాణలో ఇంకా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈరోజు ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించడంతో ఢిల్లీ వెళ్లాలనుకున్నారు.
రేపటికి వాయిదా...
కానీ ఢిల్లీలో ఈరోజు విపక్ష పార్టీలు సేవ్ డెమొక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహించడంతో పాటు రాంలీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తుండటంతో సీఈసీ సమావేశం వాయిదా పడింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Next Story

