Fri Mar 20 2026 07:46:19 GMT+0530 (India Standard Time)
Congress : ముగిసిన సీఎల్పీ భేటీ... ఏకవాక్య తీర్మానం
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది

కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. అయితే ఈ సమావేశంలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని దానిపై చర్చ జరగలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు తీసుకోలేదని తెలిసింది.
అందరికీ ధన్యవాదాలు...
పార్టీకి కష్టపడిన వారినే ముఖ్యమంత్రి ఎంపిక చేయాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతుంది. సీఎం ఎంపికను హైకమాండ్ కు అప్పగిస్తే ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని పేర్కొంది. తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని బలపర్చారు. ఈ సమావేశంలో పార్టీ గెలుపు కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Next Story

