Thu Mar 19 2026 04:26:50 GMT+0530 (India Standard Time)
నేడు బీజేపీ కీలక సమావేశం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతల సమావేశం నేడు జరగనుంది.

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతల సమావేశం నేడు జరగనుంది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు హాజరు కానున్నారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరుపుతారు. అంతా ఒకే అయితే ఈరోజు రాత్రికే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశముందని తెలిసింది.
అభ్యర్థుల ఖరారు....
తెలంగాణలో జనసేనతో పొత్తు వ్యవహారంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ప్రచారం, మ్యానిఫేస్టో తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణలో రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశం కీలకం కావడంతో ముఖ్యనేతలంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
Next Story

