Sat Mar 07 2026 11:09:33 GMT+0530 (India Standard Time)
నేడు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ
నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది.

నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. వీరితో పాటు తెలంగాణ నుంచి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హాజరవుతారు.
కీలక అంశాలపైనే...
ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న విభజన సమస్యలపై చర్చించునున్నారు. ఈ సమావేశం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది. కృష్ణాజలాల వాటాతో పాటు కార్పొరేషన్ల ఆస్తుల పంపకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
Next Story

