Sat Dec 13 2025 22:33:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గుడ్ న్యూస్ నేటి నుంచి తెలంగాణలో మీ సేవ వాట్సప్ సేవలు
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మీసేవ వాట్సప్ సేవలను అందుబాటులోకి తేనుంది

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎలాంటి సర్టిఫికెట్ కావాలన్నా మీ సేవ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఫోన్ నుంచి మీ సేవ సర్టిఫికెట్లను జారీ చేసే అవకాశం ప్రజలకు కల్పిస్తుంది. మీ సేవ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఎక్కువ సేపు ఎదురు చూడకుండా మొబైల్ ద్వారానే కావాల్సిన సర్టిటిఫికెట్లను పొందే అవకాశాన్ని నేటి నుంచి కల్పించనుంది. మీ సేవ వాట్సప్ సేవలను నేడు తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానుంది. ఏ సర్టిఫికెట్ కావాలన్నా వెంటనే ఫోన్ లోని వాట్సప్ ద్వారా మీ సేవ నుంచి పొందే ప్రతి సర్టిఫికెట్ ను పొందే వీలుంటుంది.
నేటి నుంచి...
ఈ వాట్సప్ మీ సేవ సేవలను నేడు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. ఇక మీదట పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఫోన్ ను ఉపయోగించి ఈ సేవలను పొందే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. క్యాస్ట్ , ఇన్ కమ్ సర్టిఫికెట్లు, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్లను పొందడానికి ఇకపై మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా వాట్సప్ ద్వారానే పొందే వీలును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ తమ తమ వాట్సాప్ లోనే చెక్ చేసుకునే వీలు కల్పించింది.
పదే పదే వెళ్లాల్సిన...
ఇక సర్టిఫికెట్ల కోపసం పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. కావాల్సిన సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందనున్నాయి. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్ లోనే చెక్ చేసుకునే వీలుంటుంది. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందిందా? లేకపోతే రిజక్ట్ అయ్యిందా..? అదే ఒకవేళ అప్రూవ్ అయితే సర్టిఫికెట్ను వాట్సాప్ లోనే డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. నేడు తెలంగాణ ప్రభుత్వం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించనుంది. దీనివల్ల ప్రజలు పదే పదే మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ రకమైన సేవలను అందుబాటులోకి తేనుంది.
Next Story

