Sat Dec 06 2025 14:31:59 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో మేడారం జాతర ముగింపు
ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయిన మేడారం జాతర నేటితో ముగియనుంది.

తెలంగాణ కుంభమేళా నేటితో ముగియనుంది. మేడారం జాతర నేడు అమ్మవార్ల వనప్రవేశంతో ముగియనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయిన మేడారం జాతర నేటితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు జరిగిన ఆ మహా జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమ్మవార్లకు తమ మొక్కులు తీర్చుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించుకుని కోరికలను కోరుకున్నారు.
వన ప్రవేశంతో.....
దాదాపు కోటి మందికి పైగానే భక్తులు మేడారం జాతరకు హాజరయి ఉంటారని అంచనా వేస్తున్నారు. వీఐపీలు కూడా ఎక్కువ మంది దర్శించుకున్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా చత్తీస్ ఘడ్, మహారాష్టర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నిన్న మేడారం జనసంద్రంగా మారింది. నేటితో మేడారం జాతర ముగియనుండటంతో ఈరోజు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. సాయంత్రం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగియనుంది.
Next Story

