Thu Mar 26 2026 20:47:43 GMT+0530 (India Standard Time)
Medaram : నేడు మేడారంలో తిరుగువారం పండుగ
మేడారం జాతర ముగిసింది. అయితే నేడు తిరుగువారం పండగను నిర్వహించనున్నారు

మేడారం జాతర ముగిసింది. అయితే నేడు తిరుగువారం పండగను నిర్వహించనున్నారు. మేడారం జాతర గత 28 నుంచి 31వ తేదీ వరకూ కోట్లాది మంది భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అయితే నేడు మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క-సారలమ్మలకుకు ఈరోజు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు.
ముగియనున్న పూజలు
మహాజాతర ప్రారంభమైన వారం రోజుల తర్వాత ఈ పండుగ జరుపుతారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ధూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పూర్తికానున్నాయి.
Next Story

