Sat Oct 12 2024 15:09:38 GMT+0000 (Coordinated Universal Time)
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ఆదివారం కావడంతో మేడారం భక్తులతో కిటకిటలాడుతుంది. జాతరకు ముందే పెద్ద సంఖ్యలో ఇక్కడకు భక్తులు చేరుకుంటున్నారు
ఆదివారం కావడంతో మేడారం భక్తులతో కిటకిటలాడుతుంది. జాతరకు ముందే పెద్ద సంఖ్యలో ఇక్కడకు భక్తులు చేరుకుంటున్నారు. మేడారంలో సమ్మక్క - సారలమ్మ జాతర ఈనెల 16వ తేదీన ప్రారంభం కానుంది. 19వ తేదీ వరకూ జాతర జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జాతర సమయంలో ఎక్కువగా జనం రద్దీ ఉంటుందని భావించి ముందుగానే భక్తులు ఇక్కడికి వస్తున్నారు.
ఆదివారం కావడంతో.....
ఈరోజు ఆదివారం కావడంతో మేడారంలో ఎక్కువ మంది భక్తులు చేరుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన మేడారం జాతర కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అందుకే ముందుగానే వచ్చి తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తుండటంతో మేడారంలో అప్పుడే జాతర మొదలయినట్లుంది. బెల్లాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Next Story