Wed Mar 25 2026 19:55:07 GMT+0530 (India Standard Time)
BJP : మర్రి రాజకీయం ఇక ముగిసినట్లే.. నిర్ణయం అదేనా?
సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో నామమాత్రంగానే ఉన్నారు

సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో నామమాత్రంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయంగా పెద్దగా కనిపించడం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. 2022లో మర్రిశశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాని, అటు కేంద్ర నాయకత్వం కానీ ఆయనను గుర్తించిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న మర్రి కుటుంబం ఆయన తండ్రి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని మర్రి శశిధర్ రెడ్డి అందుకున్నారు. 1994చ 2009లో మర్రి శశిధర్ రెడ్డి సనత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
మొన్నటి ఎన్నికల్లో...
అయితే మర్రి శశిధర్ రెడ్డి 2023 ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. నాడు రాజీనామా చేసిన సమయంలో మర్రి శశిధర్ రెడ్డి తాను బీజేపీలో చేరడానికి రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలేనని చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి చెంది మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. అంతే కాదు తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కాలేదని, కొనసాగుతానని ఆయన అప్పట్లో తెలిపారు. కానీ ఓటమి తర్వాత మాత్రం ఆయన పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.
ప్రస్తుత రాజకీయాల్లో...
వయసు ఎక్కువ కావడంతో పాటు ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లేనని అంటున్నారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కూడా సాహసంతో కూడుకున్నదేనని మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా తాను కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కక భంగపడి బీజేపీలో చేరినా అక్కడ కూడా సరైన ప్రాతినిధ్యం లభించకపోవడంతో ఇక గౌరవంగా రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవడం ఉత్తమమని మర్రి శశిధర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.ఇప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ గౌరవంగా పాలిటిక్స్ నుంచి దాదాపు క్విట్అయినట్లేనని అనుకోవాలి
Next Story

