Sun Mar 08 2026 05:45:23 GMT+0530 (India Standard Time)
నేడు బీజేపీలో చేరనున్న మర్రి
మర్రి శశిధర్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. జేపీ నడ్డా సమక్షంలో ఆయన ఢిల్లీలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు

సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. జేపీ నడ్డా సమక్షంలో ఆయన ఢిల్లీలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.
అసంతృప్తికి...
ఆయన తాను బీజేపీలో చేరడానికి రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలేనని చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి చెంది మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కాలేదని, కొనసాగుతానని ఆయన తెలిపారు.
Next Story

