Sat Mar 14 2026 17:58:37 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణ బంద్
మావోయిస్టు పార్టీ నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది

మావోయిస్టు పార్టీ నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో వెంకటాపురం - వాజేడు రహదారి నిర్మానుష్యంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఏజెన్సీ ఏరియాలో...
ఏజెన్సీ ఏరియాలో కొందరు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఎవరూ ఏజెన్సీ ఏరియాలో పర్యటించవద్దని, పర్యటనలు ఉంటే తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు.
Next Story

