Fri Dec 05 2025 10:52:16 GMT+0000 (Coordinated Universal Time)
లొంగిపోయిన సుజాతక్క పై కోటి రూపాయల రివార్డు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గద్వాల్ కు చెందిన సుజాతక్క మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్నార. కిషన్ జీ భార్య సుజాతక్క. కిషన్ జీ 2011లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. సుజాతక్క ఛత్తీస్ గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ ఛార్జిగా ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు విషయం నేడు పోలీసులు అధికారికంగా తెలపనున్నారు.
106 కేసుల్లో నిందితురాలు...
అయితే సుజాతక్కపై ఇప్పటికే 106 కేసులు నమోదయ్యాయి. ఆమె ఈ కేసుల్లో నిందితురాలిగా ఉండటంతో మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఉన్నారు. సుజాతక్కతో పాటు మరికొందరు మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు సమాచారం. సుజాతక్కపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఇటీవల మావోయిస్టులను ఏరివేస్తున్న క్రమంలో ఆమె లొంగిపోయినట్లు సమాచారం.
Next Story

