Thu Dec 18 2025 05:20:30 GMT+0000 (Coordinated Universal Time)
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ?
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా పలు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా పలు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రముఖంగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఖరారయినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడలేదు. గవర్నర్ కు ఇంకా జాబితాను పంపలేదు.
పేరు ఖరారయినట్లు....
అయితే టీఎస్పీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలంటే నిజాయితీ గల పూర్వపు అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం యాభై మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. అందులో చాలా దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తుంది. మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గవర్నర్ కు అనుమతి కోసం ఎవరి పేరు పంపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

