Sat Mar 07 2026 23:54:34 GMT+0530 (India Standard Time)
మంజీరా నది మహోగ్రరూపం
మంజీరా నది మహోగ్రరూపం దాల్చింది. భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి

మంజీరా నది మహోగ్రరూపం దాల్చింది. భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని నదుల్లో వరద నీరు ప్రవహిస్తుంది. కొన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మెదక్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో మంజీరా నదికి వరద ఉధృతి మరింతగా పెరిగింది.
ఏడుపాయల ఆలయం...
వరద ఉదృతికి అద్దం పడుతున్న డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరద గుప్పిట్లో ఏడు పాయల ఆలయ పరిసరాలు చిక్కుకున్నాయి.గూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఘనపురం ప్రాజెక్టు పొంగిపోర్లుతుంది. ఏడు పాయల ఆలయం వద్ద గర్భగుడి పై కప్పుకు వరద నీరు చేరడంతో భక్తులు ఎవరూ రావద్దని కోరుతున్నారు.
Next Story

