Sun Mar 15 2026 22:51:06 GMT+0530 (India Standard Time)
తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అసెంబ్లీ సిబ్బంది అడ్డుకుని, అతన్ని రక్షించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసు..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న అసెంబ్లీ సిబ్బంది అడ్డుకుని, అతన్ని రక్షించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదనే ఆవేదనతో అతడు పెట్రోల్ పోసుకున్నాడు.
Next Story

