Fri Dec 05 2025 11:32:53 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్ షిప్ ల బకాయీలను విడుదల చేయాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 20222 నుంచి పెండింగ్ లో ఉన్న 303 కోట్ల రూపాయల బకాయీలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న...
దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయీల విడుదలకు మార్గం సుగమం అయింది. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ మొత్తాన్ని ఒకే సారి విడుదల చేయాలని ఆదేశించారు. అప్పులు చేసి పేద వర్గాలు అనేక మంది విదేశాల్లో చదువుకుంటూ అత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్న వారికి ఈ ఉత్తర్వులు సాయ పడనున్నాయి. వారిని, వారి కుటుంబాలను ఆర్థిక బాధల నుంచి తప్పిస్తూ మల్లు భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

