Mon Mar 23 2026 14:25:34 GMT+0530 (India Standard Time)
Telangana : ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు బాకాయీలను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందన్న మల్లు భట్టి విక్రమార్క త్వరలోనే వాటిని చెల్లిస్తామని అసెంబ్లీలో చెప్పారు. ఉద్యోగులు ఎవరూ డీఏ బకాయీల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు...
అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల ప్రయోజనాలను కూడా గత ప్రభుత్వం చెల్లించుకుండా బకాయీలను అలాగే ఉంచిందన్న మల్లు భట్టి విక్రమార్క అందుకే గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచిందన్నారు.దీనివల్ల ప్రభుత్వం పై భారం పడిందని, మానవీయకోణంలో చూసి అందరికీ ప్రయోజనాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Next Story

