Fri Mar 20 2026 15:13:49 GMT+0530 (India Standard Time)
Breaking : ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ఇంటర్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు.

ఇంటర్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు. రానున్న విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులందరికీ మధ్యాహ్నభోజనం పెట్టనున్నట్లు తెలిపారు.
వంట శాలల ఆధునికీకరణ...
ఇంటర్మీడియట్ లో హాజరు శాతం పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న వంట శాలలను ఆధునికీకరించాలని నిర్ణయించామని తెలిపారు. ఇంటర్ విద్యార్థులు ఇకపై కళాశాలలోనే భోజనం చేసే వసతిని కల్పిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Next Story

