Fri Dec 05 2025 12:47:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : హైకోర్టు తీర్పుపై మల్లు భట్టి విక్రమార్క ఏమన్నారంటే?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత తమ తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించే ఆలోచన చేయలేదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాడు కావాల్సిన సమయం ఉన్నప్పటికీ ఎందుకు సర్వే చేయించలేదని బీఆర్ఎస్ నేతలను మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే సాంకేతికంగా లెక్కలు అవసరం కాబట్టే తాము జనగణన చేశామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాము సాంకేతికంగా బలంగా ఉండేందుకే కులగణనచేశామనితెలిపారు.
సాంకేతికంగా బలంగా ఉండేందుకు...
స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టంబరు 30వ తేదీలో పు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతోనే జీవోను తెచ్చి ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధమయ్యామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ ఎన్నికల్లోనే 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని భావించడం తప్పా అని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమపై నిందలు వేయడం చూసి ప్రజలే నవ్వుకుంటారని మల్లు అన్నారు. జీవో నెంబరు 9 తీసుకురావడానికి ముందే సర్వే చేయించామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఉభయ సభల్లో బిల్లును ఆమోదింప చేసుకుని రాష్ట్ర గవర్నర్ కు పంపామని, అది ఇంత వరకూ అతీగతీ లేదని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకూ న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతామని తెలిపారు.
Next Story

