Sun Feb 01 2026 04:00:19 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు మరో షాకింగ్ న్యూస్
మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు.

మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్లో కొన్నేళ్ల నుంచి నందికంటి శ్రీధర్ మల్కాజ్గిరి కాంగ్రెస్ నేతగా ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపు కోసం కూడా ఆయన కృషి చేశారు.
మైనంపల్లి చేరికతో...
అయితే తాజాగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనకు టిక్కెట్ దాదాపుగా కన్ఫర్మ్ కావడంతో నందికంటి శ్రీధర్ పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. స్వయంగా రాహుల్ గాంధీ బుజ్జగించినా నందికంటి శ్రీధర్ వినలేదు. మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.
Next Story

