Sun Mar 15 2026 10:21:37 GMT+0530 (India Standard Time)
ఒవైసీ ఇంటిపై దాడి
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంపై దాడి జరిగింది.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంపై దాడి జరిగింది. అసదుద్దీన్ ఇంటి పై దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు...
దీంతో పాటు సీసీ టీవీ కెమెరాలను కూడా పోలీసుల అధికారులు పరిశీలిస్తున్నారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని వచ్చే సమయానికి ఈ దాడి జరిగింది. అసదుద్దీన్ ఇంటిపై ఇది నాలుగోసారి దాడి చేశారని మజ్లిస్ వర్గాలు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

