Sun Dec 14 2025 01:49:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పీసీపీ చీఫ్ ను మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది అందుకేనట
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి నియామకపు పత్రాన్ని విడుదల చేశారు. గత కొంతకాలంగా ఢిల్లీలో పీసీసీ చీఫ్ నియామకంపై కసరత్తులు చేశారు. అనేక పేర్లను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఉండటంతో మరో సామాజికవర్గానికి ఇవ్వాలని తొలి నుంచి డిమాండ్ వినిపిస్తుంది.
బీసీ వర్గానికి చెందిన...
అందుకే బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు తనకున్న లాబీయింగ్ ను మధు యాష్కి, ప్రయత్నించారు. వీరితో పాటు ఎంపీ బలరాం నాయక్ కూడా ఈ పదవి కోసం పోటీ పడ్డారు. చివరకు పార్టీ నాయకత్వం మాత్రం మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు.
Next Story

