Thu Jan 29 2026 01:06:25 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ వాయిదా
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 2 ఆ ఫలితాల తర్వాత...
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని సూచించింది. జూన్ 2న ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నిక కావడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి పోలింగ్ నిర్వహించారు.
Next Story

