Sat Mar 07 2026 18:06:08 GMT+0530 (India Standard Time)
యాదాద్రి ఆలయ పున:ప్రారంభం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు కేసీఆర్ దంపతులు బాాలలయం నుంచి ప్రారంభమయిన శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రధానాలయం వరకూ వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య శోభాయాత్ర సాగింది.
తొలి పూజ లో...
అనంతరం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమయింది. వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ దంపతులు లక్ష్మీనరసింహస్వామికి తొలి పూజ చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు.
Next Story

