Thu Mar 12 2026 15:35:51 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ బంద్
హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేశారు

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేశారు. హోలీ పండగ నాడు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు. దీంతో నేటి ఉదయం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైన్ దుకాణాలు మూతపడ్డాయి. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహణ కోసం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
సాయంత్రం ఆరు వరకూ...
ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ దుకాణాలు, కల్లు షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కూడా ఇదే ఆదేశాలు అమలులో ఉన్నాయి.
Next Story

