Wed Mar 18 2026 02:50:06 GMT+0530 (India Standard Time)
శరత్‌చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు
లిక్కర్ స్కాంలో నిందితుడు శరత్‌చంద్రారెడ్డికి తాత్కాలిక బెయిల్ లభించింది.

లిక్కర్ స్కాంలో నిందితుడు శరత్‌చంద్రారెడ్డికి తాత్కాలిక బెయిల్ లభించింది. 14 రోజుల పాటు బెయిల్ ను న్యాయ స్థానం మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తుపై తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి నాయనమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
14 రోజుల బెయిల్...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్‌చంద్రారెడ్డి జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన నానమ్మ మరణించారు. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అంత్యక్రియలతో పాటు అనంతరం జరిగే కార్కక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా 14రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
Next Story

