Sun Mar 08 2026 05:43:05 GMT+0530 (India Standard Time)
నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం
నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది.

నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. నిజామాబాద్ నగర శివారులో చిరుతపులి కనిపించింది నాగారం డంపింగి్ యార్డ్ దగ్గర చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులిని తాము చూసినట్లు స్థానికులు చెబుతున్నారు.
పాద ముద్రలను...
దీంతో అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ ప్రాంతంలో చిరుతపులి కాలి ముద్రలను పరిశీలించే పనిలో ఉన్నారు. అది చిరుతపులా? మరేదైనా జంతువా? అన్న అనుమానంతో వారు పాదముద్రలను పరిశీలించే పనిలో ఉన్నారు. రాత్రి వేళ ఈ ప్రాంతంలో ఒంటరిగా తిరగవద్దని, పెంపుడు జంతువులు బయట వదలిపెట్టవద్దని అధికారులు చెబుతున్నారు.
Next Story

