Sun Mar 15 2026 06:32:50 GMT+0530 (India Standard Time)
పొదల్లో కదల్లేని స్థితిలో చిరుత
మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని చేగుంట మండల జైత్రాం తండా, దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించింది.

మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని చేగుంట మండల జైత్రాం తండా, దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించింది. రైతులు, పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ చిరుత ఓ చెట్టు పొదల్లో కదలకుండా ఉండిపోయింది. అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. నాలుగైదు రోజుల పాటు ఈ అటవీ ప్రాంతం వైపు రావొద్దని బీట్ అధికారి సూచించారు. చిరుత నీరసంగా ఉందని, ఎటూ కదలలేకపోతోందని దీనికి కారణాలు తెలియాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు.
Next Story

