Thu Dec 18 2025 09:22:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫాంహౌస్ ల ప్రస్తావన ఎందుకు?
గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బాగా ఉందని ఆయన అన్నారు. శాసమండలిలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ బాధ్యతల్లో ఉన్న వారు తెలంగాణ అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరమని అన్నారు. వారి కంటికి కనిపించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
కేంద్రం ఏం చేసిందని...?
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని విమర్శించే వారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం ఇచ్చిందో చెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. జాతీయ రహదారుల గురించే మాట్లాడుతున్నారని, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఫాంహౌస్ లను, కొత్త భవనాలను విమర్శించడం తగదని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు.
Next Story

