Mon Mar 16 2026 22:27:17 GMT+0530 (India Standard Time)
నేడు ఎన్నికల కమిషన్ తో భేటీ
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం చేసిన తీర్మానాన్ని అందచేయనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఎన్నికల కమిషన్ అపాయింట్ మెంట్ ను ఈ బృందం కోరింది. మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.
టీఆర్ఎస్ పేరును....
టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి పేరుగా మార్చాలంటూ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందచేయనున్నారు. తీర్మానం కాపీని అందచేయనున్నారు. పేరు మార్పునకు సంబంధించి అన్ని పత్రాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిన్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
Next Story

