Thu Mar 19 2026 05:29:28 GMT+0530 (India Standard Time)
"కమ్మ" నేతలంతా కలసి...?
తెలంగాణ కాంగ్రెస్కు చెందిన కమ్మ సామాజికవర్గం నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్కు చెందిన కమ్మ సామాజికవర్గం నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈరోజు కేసీ వేణుగోపాల్ ను కలసి తమకు టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం చేయకుండా చూడాలని కోరనున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజికవర్గం నేతలు మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుక చౌదరి నేతృత్వంలో భేటీ అయ్యారు. తమ సామాజికవర్గానికి ఈ రెండు జిల్లాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.
టిక్కెట్ల కోసం...
కాంగ్రెస్ టిక్కెట్లు త్వరలోనే ఖరారు చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక మంది ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. అక్కడ స్క్రీనింగ్ కమిటీ పెద్దలతో పాు ఏఐసీసీ నేతలను కలసి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో హస్తిన లోని లాడ్జిలన్నీ బుక్ అయ్యాయి. కొందరు నేతలు తమ ముఖ్య అనుచరులను తీసుకుని మరీ ఢిల్లీ వెళ్లారు. పార్టీ నేతలను కలసి తమ డిమాండ్లను వారి ముందుంచే చివరి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసే అవకాశముంది.
Next Story

