Mon Dec 08 2025 19:58:17 GMT+0000 (Coordinated Universal Time)
మరో బీఆర్ఎస్ నేత జంప్
తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వరసబెట్టి నేతలు వెళ్లిపోతున్నారు

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వరసబెట్టి నేతలు వెళ్లిపోతున్నారు. అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నుంచి మరో కీలక నేత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
మహేశ్వరం నియోజకవర్గంలో...
2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలిచిన తీగల కృష్ణారెడ్డి 2018 ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబిత ఇంద్రారెడ్డి టీడీపీలో చేరారు. 2023 ఎన్నికల్లో ఆమెకే బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించింది. దీంతో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎప్పడు చేరతారన్నది త్వరలోనే తేలనుంది.
Next Story

