Thu Mar 19 2026 03:51:43 GMT+0530 (India Standard Time)
Telangana : భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. హెచ్ఎండీఏ కమిషనర్ గా అమ్రాపాలి
తెలంగాణలో పెద్దయెత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ అధికారి అమ్రాపాలిని హెచ్ఎండీఏ కమిషనర్ గా నియమించారు.

తెలంగాణలో పెద్దయెత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ అధికారి అమ్రాపాలిని హెచ్ఎండీఏ కమిషనర్ గా నియమించారు. ట్రాన్స్ కో మరియు జెన్ కో సీఎండీగా రిజ్వి ని నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ఎంపీడీసీఎల్ సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డి ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
విద్యుత్తు శాఖలో...
ఎంపీడీసీఎల్ సీఎండీగా క్రాంతి వరుణ్ రెడ్డిని నియమించారు. డిప్యూటీ సీఎం ఓఎస్ డీగా కృష్ణ భాస్కర్ ను నియమించారు. ఆరోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ కార్యదర్శిగా శైలజా అయ్యర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్తు శాఖలో భారీ మార్పులు చేపడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝాను నియమించారు.
Next Story

