Fri Jan 30 2026 11:00:54 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ పర్యటన : తెలంగాణలో పోస్టర్ల కలకలం
ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్నగర్ పర్యటనకు వ్యతిరేరకంగా పెద్దయెత్తున పోస్టర్లు వెలిశాయి

ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్నగర్ పర్యటనకు వ్యతిరేరకంగా పెద్దయెత్తున పోస్టర్లు వెలిశాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదంటూ ఈ పోస్టర్లలో కనిపిస్తున్నాయి. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కర్ణాటకలోని అప్పర్ గంగ, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారంటూ ఈ పోస్టర్లలో పేర్కొన్నారు.
సవతి తల్లి ప్రేమ అంటూ...
తెలంగాణపై ప్రధాని మోదీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ ఈ పోస్టర్లలో ఉంచారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ప్రధాని పర్యటిస్తున్న నేపథ్యంలో వెలిసిన పోస్టర్లు ఎవరు వేశారు? అన్నది తెలియకపోయినా ఆయన పర్యటన సందర్భంగా వెలిసన పోస్టర్లు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ అధికారులు వెంటనే వీటిని తొలగించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.
Next Story

