Mon Dec 09 2024 04:22:38 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
బీఆర్ఎస్ పార్టీలో భారీగా నేతలు చేరారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీలో భారీగా నేతలు చేరారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేతలు నాగం జనార్థన్ రెడ్డి, పి. విష్ణువర్ధన్ రెడ్డిలు గులాబీ కండువాను కప్పుకున్నారు. తమ అనుచరులతో పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ కు చేరుకున్న ముఖ్య కార్యకర్తలందరూ కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ బాస్ కండువాలు కప్పి సాదరంగా కారు పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఇటు ఖైరతా బాద్ నియోజకవర్గం నుంచి, అటు నాగర్ కర్నూలు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి అనుచరులు, సన్నిహితులు రావడంతో తెలంగాణ భవన్ కోలాహలంగా మారింది.
కాంగ్రెస్ టిక్కెట్ రాక...
నాగం జనార్థన్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో వారిద్దరూ బీఆర్ఎస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఈ నేతల చేరికతో మరింత బలోపేతం అవుతుందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వారికి మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాలో అన్ని సీట్లు సాధించుకుంటామని తెలిపారు. పాత, కొత్త అందరూ నేతలు కలసి ముందుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలసికట్టుగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు.
Next Story