Mon Feb 02 2026 21:20:38 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఢిల్లీకి బయలుదేరిన కేటీఆర్... రేవంత్ పై ఫిర్యాదు చేయడానికేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమైన విషయాలను కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ అందించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమైన విషయాలను కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ అందించనున్నారు. అందుకోసమే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అమృత్ పథకంలో పెద్దయెత్తున తెలంగాణలో అవినీతి జరిగిందని కేటీఆర్ గత కొన్నాళ్లుగా ఆరోపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అమృత్ పథకంలో....
అమృత్ పథకంలో ఎనిమిదివేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమై కేటీఆర్ కొన్ని ఆధారాలను కూడా సమర్పించేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

