Mon Feb 23 2026 12:05:23 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు ఆదిలాబాద్ కు కేటీఆర్
నేడు ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటించనున్నారు

నేడు మంచిర్యాల జిల్లా కోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. బెయిల్ కోసం పిటిషన్ వేసిన సుమన్ తో పాటు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ తరపున న్యాయవాదులు హాజరు కానున్నారు. మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు చేసిన పోలీసులు బాల్క సుమన్ ను అరెస్ట్ చేశారు.
బాల్కసుమన్ బెయిల్ పై...
ప్రస్తుతం బాల్క సుమన్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. మరొకవైపు నేడు ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటించనున్నారు. జైల్లో బాల్కసుమన్ను పరామర్శించనున్న కేటీఆర్ వారికి ధైర్యం చెప్పనున్నారు. కేటీఆర్ పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసులను మొహరించారు.
Next Story

