Wed Feb 19 2025 20:52:36 GMT+0000 (Coordinated Universal Time)
KTR : విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ విసిరిన సవాల్ ఏంటో తెలుసా?
ఏసీబీ తనపై ఫార్ములా ఈ రేసు కారు రేసులో కేసు పెట్టినందుకే ఈడీ విచారణ కూడా చేపట్టిందని కేటీఆర్ తెలిపారు.

ఏసీబీ తనపై ఫార్ములా ఈ రేసు కారు రేసులో కేసు పెట్టినందుకే ఈడీ విచారణ కూడా చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. ఈడీ విచారణ ముగించుకుని బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అటు ఏసీబీ, ఇటు ఈడీ అధికారులు ఒకేరకమైన ప్రశ్నలే వేశారని, అన్నింటికీ తాను సమాధానం చెప్పానని కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగ విలువలను పాటించే వ్యక్తిగా ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని, సహకరిస్తానని తాను ఈడీ అధికారులకు చెప్పానని కేటీఆర్ తెలిపారు.
అవినీతి ఎక్కడుంది?
ఇందులో అవినీతి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని తెలిపారు. తనపై పెట్టిన ప్రతి ఖర్చు వృధాయేనని, ఇన్ని కోట్లు ఖర్చు అవసరమా? ఈ ధనాన్ని మరో ప్రజా ప్రయోజనానికి వినియోగించడం మేలు కదా? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై ఈడీ కేసు ఉందని, తనపై కూడా ఈడీ కేసు ఉందని, సిట్టింగ్ జడ్జి ఎదుట ఇద్దరినీ విచారణచేయవచ్చని, అవసరమైతే లై డిక్టటర్ పరీక్షలకు కూడాసిద్ధమని సవాల్ విసిరారు.
Next Story